వసుధార పెళ్ళి గురించి రిషి తెలుసుకున్నాడా!
on Feb 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ "గుప్పెడంత మనసు" ఎపిసోడ్ -679 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో.. జగతి, మహేంద్రలకి నిజం తెలియడం తో ఆనందంగా ఉంటారు. రిషి కాలేజీకి వచ్చి "వసుధార మెడ లో ఎవరు తాళి కట్టారు" అని ఆలోచిస్తాడు. అప్పుడే వసుధార వచ్చి రిషికి వెనకాల వైపు కూర్చుంటుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. కాసేపటికి ఎక్కడున్నావ్ వసుధార అని రిషి మెసేజ్ చేస్తాడు. దాంతో అక్కడే ఉన్న వసుధార.. రిషిని చూస్తూ మెసేజ్ చేస్తుంది. కొద్దిసేపు వాళ్లిద్దరి చాటింగ్ సీన్ చూడటానికి బాగుంటుంది. ఒకరినొకరు చూసుకున్నా మాట్లాడుకోకుండా చాటింగ్ కంటిన్యూ చేస్తారు.
అప్పుడే అక్కడికి వచ్చిన జగతి, మహేంద్రలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి నవ్వుతూ మాట్లాడుతుంది వసుధార.
అదంతా దూరం నుండి గమనించిన రిషి.. "వీళ్ళేంటి బాగా మాట్లాడుకుంటున్నారు.. వసుధార తన పెళ్లి గురించి చెప్పిందా" అని మనసులో అనుకుంటాడు. కాసేపటికి వసుధార అక్కడ నుండి వెళ్ళడంతో.. జగతి, మహేంద్రల దగ్గరికి రిషి వస్తాడు. "వసుధార మీకేమైన చెప్పిందా" అని అడుగగా.. "లేదు మాకేం చెప్పలేదు.. నీకేమైనా చెప్పిందా" అని జగతి అంటుంది. అంతలోనే ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు మహేంద్ర. రిషి వెళ్ళిపోయాక.. "నాకు రిషి, వసుధారలను కలిపే ఆలోచన వచ్చింది" అని జగతితో అంటాడు మహేంద్ర. అదేంటో చెప్పండి అని జగతి అడుగగా.. "వాళ్ళిద్దరిని ప్రాజెక్ట్ మీద టూర్ కి పంపించాలి" అని మహేంద్ర చెప్తాడు.
మరొకవైపు వసుధార మెడలో ఎవరు తాళి కట్టారో ఎలాగైనా నిజం తెలుసుకోవాలని రిషి, వసుధార క్యాబిన్ కి వెళ్తాడు. రిషి ఇండైరెక్ట్ గా తన పెళ్లి గురించి అడిగితే... వసుధార డైవర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆకలి అవుతుంది రిషి సర్ అని వసుధార అనగానే.. సరే తిను అంటాడు రిషి. మీరు తినకుండా నేను తినను అని వసుధార అనగానే, మొండిదానివి అంటూ సరే పదా తిందాం అని ఇద్దరూ కలసి వెళ్తారు. ఇక మినిస్టర్ గారిని కలిసిన జగతి, మహేంద్ర లను ప్రాజెక్ట్ గురించి మెచ్చుకుంటాడు. ఆ తర్వాత దేవాయానికి ఫోన్ చేసి.. "మేము నాలుగు రోజులు బయటికి వెళ్తున్నాం" అని జగతి చెప్తుంది. "ఎక్కడకి? ఎందుకు వెళ్తున్నారు" అని దేవాయాని అడుగగా.. తర్వాత చెప్తానని ఫోన్ కట్ చేస్తుంది జగతి. దేవయాని మాత్రం వీళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
